వీరఘట్టంలో రూ. 50 లక్షలతో కోనేరు సమగ్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన

​పాలకొండ వెబ్ న్యూస్, 07 జూన్ 2026:

​పార్వతిపురం మన్యం జిల్లా వీరఘట్టం పట్టణంలో ఉల్లి వాని లక్ష్మీనారాయణ కోనేరును వాటర్ షెడ్ నిధుల ద్వారా (WDC- PMKSY 2.0) సమగ్ర అభివృద్ధి చేయడానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సుమారు యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో గట్టు బలోపేతం, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, సోలార్ లైట్లు, చిల్డ్రన్ ప్లేయింగ్ మెటీరియల్ వంటి వసతుల కల్పన కోసం పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.

​ఈ కార్యక్రమంలో వీరఘట్టం ఎంపీడీఓ, బెండాల వెంకటరమణ, పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, ఉదయాన ఉదయ్ భాస్కర్, జామి లక్ష్మీనారాయణ, గొర్లె గౌరు నాయుడు, చింత ఉమామహేశ్వరరావు, జాడ శ్రీధర్, కొండదాడి రాజేష్, మజ్జి పురుషోత్తం, నివర్తి శశి, జంపు శేఖర్, జనసేన జానీ, జి. కోటేశ్వరరావు, ఏపిఓ, సత్యం నాయుడు, ఈసీ, టిఏసి, FA తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments