పాలకొండ వెబ్ న్యూస్, 07-06-2026: పాలకొండ కొండవీధి రియల్ ఎస్టేట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమ్మర్ స్పెషల్ టి10 సీజన్-1 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ఘనంగా ముగిసింది. జియో బాయ్స్ జట్టుపై కొండవీధి-A జట్టు ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పెద్దలు పేర్కొన్నారు. అనంతరం విజేతలైన కొండవీధి-A జట్టుకు ఛాంపియన్ ట్రోఫీతో పాటు పదిహేను వేల రూపాయల నగదు, రన్నరప్‌గా నిలిచిన జియో బాయ్స్ జట్టుకు ట్రోఫీతో పాటు ఎనిమిది వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఈ టోర్నమెంట్ యువ క్రీడాకారులకు మంచి వేదికగా నిలిచింది. కార్యక్రమంలో నిర్వాహకులు లోడగల రాజ్ శేఖర్, పున్నాన రవికుమార్, పొట్నూరు రమేష్, దుబా శంకర్, క్రీడాకారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments