పాలకొండ వెబ్ న్యూస్
పాలకొండ పట్టణానికి చెందిన కొండదాడి ఐతిహ్య శనివారం రాత్రి భక్తులను తన సంగీతంతో అలరించింది. దసరా నవరాత్రుల సందర్బంగా శ్రీ కోటదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఐతిహ్య కర్ణాటక సంగీత ప్రదర్శన చేసింది.
అనేక రాగాలలో భక్తి గీతాలు, శాస్త్రీయ కృతులను ఆవిష్కరించి, ఆలయ ప్రాంగణంలో సన్నివేశమైన భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్రావ్యమైన గానంతో పాటు ఆమె చూపిన ప్రతిభకు ప్రేక్షకులు ఘనంగా అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ “నవరాత్రుల పవిత్ర వాతావరణంలో ఐతిహ్య ఆలపించిన కీర్తనలు ఆధ్యాత్మికత ను కలిగించాయి. స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు తరచూ జరగాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.
సంగీత ప్రదర్శన ముగిసిన అనంతరం ఐతిహ్యకు సన్మానం చేసి ఆశీర్వదించారు.
News by: BSS Prasad

0 Comments