ఉత్తరాంధ్ర కు భారీ వర్షాలు

ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటనుందని తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, గుంటూరు సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, శిధిల భవనాల వద్ద తలదాచుకోవద్దని సూచించారు.

Post a Comment

0 Comments