ఏపీ మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ మరియు రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అనెపు రామకృష్ణ నాయుడును బూర్జ మండలం, పెద్దపేట గ్రామంలో ఘనంగా సన్మానించారు. తూర్పు కాపు జిల్లా అధ్యక్షులు చౌదరి నాయుడు ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ, తనకు ఈ పదవి లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తూర్పు కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు తూర్పు కాపు నాయకులు, కార్యకర్తలు హాజరై రామకృష్ణ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక వర్గానికి సేవ చేసేందుకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
News by : BSS Prasad cell 9985291832

0 Comments