8 ప్రభుత్వ బ్యాంకులే మిగిలే అవకాశం

ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) విలీన ప్రక్రియ మరోసారి వేగం తీసుకోనుందని వార్తలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వ బ్యాంకుల్లో నాలుగింటిని విలీనం చేసి, మొత్తం సంఖ్యను 8కి తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.

విలీనానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేర్లు వినిపిస్తున్నాయి. ఇవి పెద్ద బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి వాటిలో విలీనం కావచ్చని అంచనా.

అయితే ఈ అంశంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ లేదు. బ్యాంకులు ప్రస్తుతం తమ బ్యాలెన్స్ షీట్ల బలోపేతం పైనే దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments